News September 13, 2025

UPDATE: రేణు హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

image

కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో క్యాబ్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టన పోలీసులు.. ఒక నిందితుడిని జార్ఖండ్‌లో, మరొకరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను మధ్యాహ్నం 1 గంటకు సీపీ అవినాష్ మహంతి వెల్లడించనున్నారు.

Similar News

News December 17, 2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.

News December 17, 2025

ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

image

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>

News December 17, 2025

మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

image

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.