News April 25, 2024
UPSC 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల

2025లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను UPSC ప్రకటించింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి మే 25న పరీక్ష నిర్వహించనుంది. ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు UPSC మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. వీటితో పాటు CBI, ఇంజినీరింగ్ సర్వీసెస్, CISF, NDA, IFS, CDS తదితర పరీక్షల షెడ్యూల్‌నూ ప్రకటించింది. వివరాలను upsc.gov.inలో ఉంచింది.
Similar News
News April 16, 2026
నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.
News April 16, 2026
యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.
News April 16, 2026
రాష్ట్రమంతటిపై ‘అమరావతి’ భారం: సజ్జల

AP: అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘CBN చేస్తున్నది సంపద సృష్టికాదు దోపిడీ. ఇతర చోట్ల ఇటువంటి నిర్మాణాలకు Sftకి ₹3వేలలోపు ఉంటే ఇక్కడ ₹14వేలు ఖర్చు చేస్తున్నారు. హైరైజ్డ్ పేరిట 40-50 అంతస్తులు కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తున్నారు. ఇదంతా మోయలేని భారం. ఆ ఖర్చును రాష్ట్రమంతా భరించాలంటున్నారు’ అని పార్టీ BC నేతల భేటీలో విమర్శించారు.


