News November 6, 2024
US పోల్స్: మెజారిటీ సాధించేదెవరు?
అమెరికా ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. వైట్‌హౌస్ పాలన ఎవరికి దక్కుతుందని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఏ అభ్యర్థి 270 ఓట్లను క్రాస్ చేస్తారో వారిదే విజయం కానుంది. ప్రస్తుతం ట్రంప్ 177 ఓట్లు సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కమల 99 ఓట్లు పొందారు. స్వింగ్ స్టేట్స్‌లో అతిపెద్దదైన పెన్సిల్వేనియాలో మాత్రం కమల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అక్కడి షేర్ మార్కెట్లు సైతం లాభాల దిశగా సాగుతున్నాయి.
Similar News
News December 6, 2024
S.K అధ్యక్షుడు యూన్‌కు అభిశంసన తప్పదా?
నియంతృత్వ పోకడలు ప్రదర్శించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తప్పేలా లేదు. దేశంలో సైనిక పాలన విధించిన యూన్ ప్రజాగ్రహానికి తలొగ్గిన విషయం తెలిసిందే. అయినా ఆయన్ను తప్పించేందుకు అధికార, విపక్షాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. యూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. 2027 వరకు పదవీకాలం ఉన్నా అభిశంసన నెగ్గితే యూన్ తప్పుకోవాల్సిందే.
News December 6, 2024
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
TG: విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడంలేదు. ఇటీవల శ్రీచైతన్య, నారాయణ సంస్థల్లో పలువురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మేడ్చల్ సమీపంలోని MLRIT ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని శ్రావణి(18) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకుంది. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారంటూ శ్రావణి బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
News December 6, 2024
చర్మంపై ముడతలా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి
యూత్‌ఫుల్ స్కిన్ ప్రతి ఒక్కరి కోరిక. వయసు పెరగడం, వాతావరణ మార్పులతో చర్మం ముడతలు పడటం సహజం. ఇలా కావొద్దంటే అసంతృప్త కొవ్వులుండే అవకాడో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇక విటమిన్ E నిగారింపు పెంచుతుంది. బ్లూ, బ్లాక్, స్ట్రా బెర్రీస్‌లోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. ఒమేగా 3 దొరికే అవిసెలు, చేపలు, విటమిన్స్, మినరల్స్ లభించే ఆకుకూరలు తీసుకోవాలి.