News April 22, 2024
ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులు!

1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఏడాదిన్నరలోపే ఆ లోక్‌సభ రద్దైంది. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష అనివార్యమైంది. BSP మద్దతు ఇస్తామని.. ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులైంది. అయితే 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 17, 2025
మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.
News December 17, 2025
సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

TG: రాష్ట్రంలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 17, 2025
Avatar-3కి షాకింగ్ రివ్యూస్

ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్3కి కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. BBC, గార్డియన్, రోటెన్ టొమాటోస్, IGN సహా మీడియా హౌజెస్ మూవీ స్టోరీ ఆకట్టుకోదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ బాగున్నా కొన్ని సీన్స్ గతంలో చూశాం అనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి. కాగా అవతార్1కు మంచి రెస్పాన్స్ రాగా, పార్ట్2ను క్రిటిక్స్ ఓకే అన్నారు.


