News February 27, 2025
ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీసీ నేత వల్లభనేని వంశీ మూడోరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Similar News
News February 27, 2025
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును ఆయన బయటకు చెప్పారని వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.
News February 27, 2025
P4కు అర్హులు ఎవరు?

AP: P4 కార్యక్రమం అమలు చేయనున్న ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి/5 ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు అర్హులు కారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేస్తుండగా, మార్చి 18 నాటికి మిగతా జిల్లాల్లో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించనుంది.