News April 20, 2024

తూర్పుగోదావరిలో జనసేనాని వారాహి యాత్ర

image

AP: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేనాని వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కోరుకొండ బస్టాండ్‌లో సభ ఉంటుందని కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి హాజరుకానున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. టీడీపీీ నేతలతో సమావేశం కానున్నారు.

Similar News

News December 17, 2025

AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

image

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.

News December 17, 2025

MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్.. నెక్స్ట్ ఏంటి?

image

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ప్రసాద్ ఐదుగురు <<18592868>>MLA<<>>ల వాదనలతో ఏకీభవించారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన మాట నిజమేనని కానీ పార్టీ మారలేదని, కండువా కప్పుకోలేదని వారు స్పష్టం చేశారు. నిధుల కోసం CMను కలవడంలో తప్పు లేదని వాదించారు. దీంతో వారు పార్టీ మారినట్లు BRS చేసిన ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు. ఫలితంగా వారు MLAలుగా కొనసాగనున్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలపనున్నారు.

News December 17, 2025

రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

image

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.