News May 14, 2024

సీఎం విదేశీ పర్యటనపై నేడు తీర్పు

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 17, 2025

సూర్య నమస్కారాల్లో 108 విశిష్టత..

image

సూర్య నమస్కారాన్ని 9 సార్లు ఆచరిస్తే.. ఎంతో ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఒక్క సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. అలా.. 12 భంగిమలు * 9 సూర్య నమస్కారాలు = 108 అవుతుంది. ఈ సాధన మన మనసు, శరీరం ప్రకృతితో సమానంగా ఒకే తాటిపై నడిచేలా చేసి, ప్రశాంతంగా, శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుందట. శ్వాస వ్యాయామాలు, ఇతర ఆసనాలను 108 సార్లు సాధన చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు పండితులు.

News December 17, 2025

AIIMS నాగపూర్‌లో ఉద్యోగాలు

image

<>AIIMS<<>> నాగపూర్ 86 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి మెడికల్ పీజీ(MD, MS)ఉత్తీర్ణతతో పాటు NMC/MCI/MMC/DCIలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు రూ.250. వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in

News December 17, 2025

రబీ పంటల డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం

image

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి డిజిటల్ క్రాప్ సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. రబీ సీజన్‌లో అన్ని రకాల పంటలతో పాటు అన్నిరకాల భూ కమతాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. పంటల నమోదుకు గరిష్ట స్థాయి 20 మీటర్ల దూరం మాత్రమేనని స్పష్టం చేశారు. ఫార్మర్ యూనిక్ ఐడీ నమోదుకాని రైతుల వివరాలను వెంటనే నమోదు చేయించాలని సూచించారు.