News October 5, 2024
14 నుంచి ఏపీలో ‘పల్లె పండుగ’

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ‘పల్లె పండుగ’ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.
Similar News
News December 12, 2025
ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News December 12, 2025
నైనిటాల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు

<
News December 12, 2025
నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

దుబాయ్ వేదికగా నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్‌లన్నీ 10.30AM నుంచి ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో వీక్షించవచ్చు.


