News April 3, 2024
విశ్వక్ సేన్ ‘గామి’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ నెల 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా ప్రసారం కానుంది. కాగా గత నెల 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగిత విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అభినయ, సమద్ తదితరులు నటించారు.
Similar News
News February 13, 2026
బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్‌కు తొలి అభ్యర్థన!

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్‌కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.
News February 13, 2026
YCPని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది: పవన్ ఎద్దేవా

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి రభస చేయడంపై Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాగితాలు చించి విసరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన YCPని చూసి ఏం చేయకూడదో, ఏం చేయాలో వంటి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
News February 13, 2026
తమన్నా ‘బోల్డ్’ హారర్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారారు. బాలీవుడ్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి MMS’ థర్డ్ పార్ట్‌లో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్ నిర్మించే ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. శశాంక ఘోష్ డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీలో బోల్డ్ కంటెంట్‌తో పాటు ‘డేట్ నైట్ హారర్’ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను అలరించనున్నాయి.


