News August 23, 2025
GCC విస్తరణలో టైర్-2&3 నగరాల్లో వైజాగ్

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) విస్తరణ కోసం దేశంలోని టైర్-2 & టైర్-3 నగరాలు ముఖ్యమైన గమ్యస్థానాలుగా మారుతున్నాయి. గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్-1 సిటీలపై దృష్టి పెట్టిన కంపెనీలు ఇప్పుడు చిన్న నగరాల్లోనూ అవకాశాలను గుర్తిస్తున్నాయి. ఇందులో ఏపీ నుంచి వైజాగ్ ఉండగా తెలంగాణ నుంచి ఏ నగరానికీ గుర్తింపు రాలేదు. కంపెనీలు వస్తే మౌలిక వసతులు అభివృద్ధి చెంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
Similar News
News January 22, 2026
మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సీక్రెట్ వెపన్.. కన్ఫమ్ చేసిన ట్రంప్!

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న సమయంలో ఓ ప్రత్యేక రహస్య ఆయుధం వాడినట్లు వచ్చిన వార్తల్ని ట్రంప్ ధ్రువీకరించారు. తమ వద్ద ప్రపంచంలో ఏ దేశం దగ్గరా లేని ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. వాటి గురించి అంతగా మాట్లాడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అవి చాలా శక్తిమంతమైనవని.. వాటి గురించి ఎవరికీ తెలియదన్నారు. మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సోనిక్ వెపన్ ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి.
News January 22, 2026
గర్భాశయం పొర మందంగా ఉందా?

స్త్రీ సంతానోత్పత్తిలో గర్భాశయం పొర ఎండోమెట్రియల్ మందం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కొందరిలో ఎండోమెట్రియల్ లైనింగ్ మందం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, స్పాటింగ్ కనిపించడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. దీనికి ప్రధాన కారణం హార్మోన్లు. ఈ సమస్య తరచూ వస్తుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు దారితీస్తుందంటున్నారు. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి.
News January 22, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


