News February 5, 2025
VJA: ‘ఆపదలో ఈ నంబర్లకు ఫోన్ చేయండి’

జక్కంపూడి YSR కాలనీలోని ZP హైస్కూల్ విద్యార్థులకు పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లత కుమారి పాల్గొన్నారు. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు 1930, 112 తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలల రక్షణకు అమలవుతున్న పలు చట్టాల గురించి వివరించారు.
Similar News
News February 8, 2025
తండేల్ సినిమాలో మంచిర్యాల జిల్లా వాసి

కన్నెపల్లి మండల కేంద్రం ముత్తపూర్‌కు చెందిన హరీశ్ మొదట ఢీ జోడిలో సైడ్ డాన్సర్‌గా రాణించారు. అనంతరం శుక్రవారం విడుదలైన తండేల్ సినిమాలో విలన్‌కు సైడ్ క్యారెక్టర్‌గా హరీశ్ నటించారు. డైరెక్టర్‌గా చందూ మొండేటి, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన హరీశ్ చిన్న పాత్రలో కనిపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సినిమాలో కనిపించారు.
News February 8, 2025
కాగజ్‌నగర్: వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ మహేందర్

కాగజ్‌నగర్ మండలంలోని ఇస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహేందర్ ఉదయం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ టెస్టులు చేశారు. వాహన పత్రాలు, లైసెన్స్, హెల్మెట్ లేని వారికి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారులు లైసెన్స్‌తో పాటు ద్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు.
News February 8, 2025
రంగారెడ్డి జిల్లా మార్నింగ్ అప్డేట్ @7AM

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యల్పంగా రెడ్డిపల్లిలో 14.4℃, చుక్కాపూర్ 14.7, చందనవెల్లి 15.1, కాసులాబాద్ 15.5, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 15.4, మంగళపల్లి 16.3, రాజేంద్రనగర్ 15.7, కొందుర్గ్ 15.7, ఎలిమినేడు15.4, రాచలూరు 16, విమానాశ్రయం 15.8, దండుమైలారం 16.8, తొమ్మిదిరేకుల 15.8, కేతిరెడ్డిపల్లి 15.8, వైట్‌గోల్డ్ SS 16.1, వెల్జాల 16.2, అమీర్‌పేటలో 16.6℃గా నమోదైంది.