News September 12, 2025
VJA: చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు 106 మంది

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా కేసుల 194కు చేరినట్లు కలెక్టర్ లక్ష్మీశా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కలెక్టర్ విడుదల చేసిన బుల్ టెన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం నమోదైన కేసులు: 194, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు: 106, చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయినవారు: 88గా ఉన్నాయి.
Similar News
News December 16, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరి(30) అనే వివాహిత మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపారు. సీఏగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.
News December 16, 2025
వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ నరసింహ

రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్, దట్టమైన పొగమంచు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, హైవేలపై డ్రైవ్ చేసేవారు తక్కువ వేగంతో, మంచి లైటింగ్, ఇండికేటర్లతో ఒకే లైన్‌లో వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు.
News December 16, 2025
‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


