News August 22, 2025

VJA: దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన CP

image

విజయవాడలో జరగబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు సీపీ పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

సిరిసిల్ల: ‘గోశాల నిర్మాణానికి స్థలం గుర్తించాం’

image

గోశాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సెక్రెటరీ ఇలంబర్తి తెలిపారు. సిరిసిల్ల IDOC నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోలో కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు. జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో గోశాల నిర్మాణానికి స్థలం గుర్తించామని, దానిని తాను పరిశీలించానని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఇంచార్జ్ కలెక్టర్ వివరించారు.

News January 20, 2026

సిరిసిల్ల: గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు

image

అధునాతన గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి తెలిపారు. అధునాతన పద్ధతుల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, ఆలయానికి అనుబంధంగా గోశాలల నిర్మాణం తదితర అంశాలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు.

News January 20, 2026

9 రోజుల పాటు విశాఖ ఉత్సవం

image

విశాఖ ఉత్సవాలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై నేడు సమీక్షించారు. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనితతో పాటు MP శ్రీభరత్, ఉమ్మడి జిల్లాల MLAలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివరించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు.