News October 5, 2025
VJA: దారుణ హత్య.. డ్రైనేజీల్లో మహిళ శరీర భాగాలు

విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ సైకో థ్రిల్లర్ సినిమా తరహాలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నగరంలోని వివిధ డ్రైనేజీల వద్దకు ఆ మహిళ శరీర భాగాలు కొట్టుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మహిళను హతమార్చి, ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీల్లో కలిపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 20, 2026
ఏ బాటిల్‌లో నీటిని నిల్వ చేస్తున్నారు?

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.
News January 20, 2026
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
News January 20, 2026
మేడారంలో మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టం!

మేడారం మహా జాతరలో భక్తుల భద్రత కోసం ప్రభుత్వం ‘మేడారం 2.0’ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది. AI ఆధారిత ‘టీజీ-క్విస్ట్’ డ్రోన్లు, హీలియం బెలూన్లకు అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు. తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించేందుకు వోడాఫోన్-ఐడియా సహకారంతో ప్రత్యేక ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై జాతరలో భక్తులు తప్పిపోతారనే భయం ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


