News December 1, 2025
VJA: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం సోదరుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాంప్రసాద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
బందరు పోర్ట్, బుడమేరుకు మొండిచేయి..!

బందరు పోర్టు పనులకు గత ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించగా, పోర్టు పనులు 50 శాతం పూరైనా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బుడమేరు ప్రక్షాళనకు నిధులు వస్తాయని కూటమి నేతలు ఆశా భావం వ్యక్తం చేసినా చివరికి మొండిచేయే మిగిలింది. ఇక విజయవాడ, వైజాగ్ మెట్రో పనులకు కలిపి రూ. 15.50 కోట్లు కేటాయించారు. ఐతే ఇప్పటివరకు కేంద్రం నుంచి మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు రాలేదు.
News February 15, 2026
బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.
News February 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


