News December 2, 2025

VJA: నిధులపై వివరణ కోరిన ఎంపీ కేశినేని చిన్ని

image

సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మంజూరైన నిధులపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 1.83 లక్షల పనులకు ఆమోదం లభించగా, ఏపీలో 2,677 పనులకు ఆమోదం లభించి, 1,573 పనులు పూర్తయ్యాయి అని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి రూ.14,200.38 లక్షల నిధులు మంజూరైనట్లు వివరించారు.

Similar News

News February 19, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.

News February 19, 2026

సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

image

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News February 19, 2026

NGKL: చేపలు అమ్మడానికి సబ్సిడీపై వాహనాలు

image

NGKL జిల్లాలో చేపల విక్రయానికి గాను మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు తెలిపారు. PM మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 13 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఐస్ బాక్స్‌లు మంజూరు అయినట్లు తెలిపారు. ఒక్క యూనిట్ 75,000 ఉంటుందని, అందులో జనరల్ 7, మహిళలకు 2, ఎస్సీ 2, ఎస్టి 2, జనరల్ కు 40 శాతం, ఎస్సీ ఎస్టీలకు 60% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలన్నారు.