News December 2, 2025
VJA: నిధులపై వివరణ కోరిన ఎంపీ కేశినేని చిన్ని

సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మంజూరైన నిధులపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 1.83 లక్షల పనులకు ఆమోదం లభించగా, ఏపీలో 2,677 పనులకు ఆమోదం లభించి, 1,573 పనులు పూర్తయ్యాయి అని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి రూ.14,200.38 లక్షల నిధులు మంజూరైనట్లు వివరించారు.
Similar News
News February 10, 2026
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.
News February 10, 2026
12న ఏనుమాముల మార్కెట్‌కు సెలవు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఈ నెల 12న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. మార్కెట్‌లోని గుమస్తాలు, దాడువాయిలు సమ్మెకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని, కావున రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు.


