News December 1, 2025
VJA: ప్రయాణికులకు అలర్ట్..రైళ్ల రద్దు వివరాలివే.!

విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా ఉమ్మడి కృష్ణా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 2026 JAN 31న నం.22876/75 GNT-VSKP ఉదయ్ ఎక్స్‌ప్రెస్, JAN 28, 29న నం.17219 MTM-VSKP ఎక్స్‌ప్రెస్, JAN 29, 30న నం.17220 VSKP-MTM ఎక్స్‌ప్రెస్, JAN 28న నం.22708 TPTY-VSKP ఎక్స్‌ప్రెస్, JAN 29న నం.22707 VSKP-TPTY ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News February 18, 2026
మరోసారి అభిషేక్ డకౌట్

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.
News February 18, 2026
విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
News February 18, 2026
నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.


