News August 14, 2025

VJA: బీఐఎస్ అధికారుల దాడులు.. రూ.13 కోట్ల వస్తువులు సీజ్

image

విజయవాడలో బీఐఎస్‌ అధికారులు గురువారం ఆకస్మిక దాడులను చేశారు. ఈ దాడుల్లో రూ.13 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నకిలీ హాల్‌మార్క్‌ మోసాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అక్షయ హాల్‌మార్క్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. విజయవాడతో సహా 7 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేపట్టారు.

Similar News

News March 6, 2026

పార్వతీపురం: ‘15 లోగా CSC పనులను పూర్తి చేయాలి’

image

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

News March 6, 2026

నిర్మల్: పరీక్షలకు 143 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం-2, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 5677 మంది విద్యార్థులకు గాను 5534 మంది హాజరు కాగా, 143 మంది గైర్హాజరయ్యారు. దిలావర్‌పూర్, కుంటల, నిర్మల్ బాలుర జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.

News March 6, 2026

కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.