News September 12, 2025
VJA: ‘రొయ్యల ఎగుమతులతో రూ.60 వేల కోట్లు ఆదాయం’

మన రాష్ట్రంలో పండించే రొయ్యలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏడాదికి రూ. 60 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి వస్తుందని ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరామ్ అన్నారు. అమెరికా అధిక సుంకాల నేపథ్యంలో రొయ్యల ఎగుమతి ధరలు తగ్గటం వల్ల రొయ్యలు సాగు చేసే రైతులతో పాటు, దేశం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 16, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరి(30) అనే వివాహిత మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపారు. సీఏగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.
News December 16, 2025
వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ నరసింహ

రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్, దట్టమైన పొగమంచు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, హైవేలపై డ్రైవ్ చేసేవారు తక్కువ వేగంతో, మంచి లైటింగ్, ఇండికేటర్లతో ఒకే లైన్‌లో వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు.
News December 16, 2025
‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


