News November 9, 2025
VJA: విద్యార్థులకు ముఖ్య గమనిక

సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 2025-26 అకడమిక్ ఇయర్ పీజీ ప్రవేశాలకై కట్టాల్సిన ఫీజులు, సమర్పించాల్సిన సర్టిఫికెట్ల జాబితా విడుదలైంది. వర్సిటీ రుసుం రూ. 23,600, వార్షిక ట్యూషన్ ఫీజు రూ. 30వేలుగా నిర్ణయించామని, పీజీ అడ్మిషన్‌కై ఫొటోలు, అడ్మిట్ కార్డు, ర్యాంక్ లెటర్, ఎంసీ రిజిస్ట్రేషన్, ఇంటర్న్‌షిప్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్ తప్పనిసరని, అలాగే కోర్సు విడిచిపెడితే రూ.3 లక్షల బాండ్ ఉంటుందన్నారు.
Similar News
News January 19, 2026
మా ఆట నిరాశపరిచింది: గిల్

న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తాము ఆడిన విధానం నిరాశపరిచిందని భారత కెప్టెన్ గిల్ అన్నారు. ‘మేం కొన్ని విషయాలను సరిచేసుకోవాలి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు మాకు సానుకూల అంశం. 8వ స్థానంలో వచ్చి హర్షిత్‌లా ఆడటం అంత సులభం కాదు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎలాంటి కాంబినేషన్స్ పని చేస్తాయో చూడాలి’ అని <<18892634>>మ్యాచ్ అనంతరం<<>> చెప్పారు.
News January 19, 2026
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.
News January 19, 2026
జగిత్యాల జిల్లాలో 6వ రోజు తనిఖీలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ అనలైజర్లతో వాహనదారులను పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు హెచ్చరించారు.


