News November 19, 2025

VKB‌లో నంబర్‌లేని వాహనాలు సీజ్: ఎస్పీ

image

వికారాబాద్ జిల్లాలో నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ జరిగింది. సరైన నంబర్ ప్లేట్లు లేని, టాంపరింగ్ చేసిన, అక్రమ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు చర్య తీసుకున్నారు. అక్టోబర్ నెలలో మొత్తం 3,325 వాహనాలను సీజ్ చేసినట్టు జిల్లా SP K.నారాయణ రెడ్డి తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు.

Similar News

News January 22, 2026

మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

image

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.

News January 22, 2026

విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

image

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.

News January 22, 2026

తిరుపతి: ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ ప్రారంభం

image

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగినట్లు చెప్పారు. తొలిరోజు 2,107 మందికి 2,028 మంది హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష ముగిసింది.