News March 12, 2025

VKB: ఆ విద్యార్థికి పేదరికం అడ్డురాలేదు..!

image

తల్లిదండ్రులు మరణించినా, నిరుపేద కుటుంబం అయినా వెనుకడుగు వేయకుండా గ్రూప్-2 పరీక్షలో సత్తా చాటాడు వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నేనావత్ అనిల్. బుధవారం విడులైన గ్రూప్-2 ఫలితాల్లో స్టేట్ 106 ర్యాంక్‌, STల్లో 4వ ర్యాంక్ సాధించాడు. అనిల్‌ది నిరుపేద కుటుంబమైనా స్టేట్ లెవెల్‌లో సత్తా చాటడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలుపుతున్నారు.

Similar News

News February 18, 2026

EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

image

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News February 18, 2026

CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌

image

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.

News February 18, 2026

నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

image

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.