News April 24, 2025

VKB: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని VKB అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

Similar News

News March 12, 2026

NRPT: ఈనెల 31న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్

image

నారాయణపేట జిల్లాలో 4 తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేష్ తెలిపారు. ప్రతి మండలంలో కనీసం 20 మంది బాలురు, 20 మంది బాలికలు నమోదు కావాలని సూచించారు. వారిలో నుంచి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంఈవో లాగిన్ ద్వారా జిల్లా స్థాయికి పంపిస్తారు. 31న జిల్లా స్థాయిలో మినీ స్టేడియంలో ఉదయం జరుగుతాయని తెలిపారు.

News March 12, 2026

శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.

News March 12, 2026

NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.