News September 12, 2025
VKB-కృష్ణ రైల్వేలైన్ పనులు చేపట్టాలి: CM

వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే వికారాబాద్ – కృష్ణ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్, పరిగి ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.
Similar News
News December 15, 2025
పెద్దపల్లి: వీ- హబ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 15, 2025
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ రంగు మారినా, వెజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. దాంతో పిండం గర్భాశయంలోకి వెళ్లదు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News December 15, 2025
ఇది తమిళనాడు.. తలవంచబోం: స్టాలిన్

తమ తర్వాతి టార్గెట్ తమిళనాడేనని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ BJP ఎప్పటికీ గెలవలేదన్నారు. ‘ఇది తమిళనాడు. మా క్యారెక్టర్‌ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం’ అని స్పష్టం చేశారు. BJP గెలవలేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని, అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు.


