News December 1, 2025
VKB: జిల్లాలో మొదటిరోజు 184 నామినేషన్లు: కలెక్టర్

జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 184 సర్పంచ్ అభ్యర్థులకు, వార్డ్ మెంబర్లకు 182 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం రెండో విడత నామినేషన్లలో భాగంగా వికారాబాద్ డివిజన్లో మామూలుగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. సోమవారం భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు.
Similar News
News February 18, 2026
ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్ల పట్టివేత!

ఉప్పుగూడలో గంజాయి చాక్లెట్లను తండైలో కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ (23) ఇటీవలే ఉప్పుగూడకు మకాం మార్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. సుమారు 9.6కిలో గ్రాముల బరువు చేసే 1,920 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
News February 18, 2026
నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పదోన్నతుల సందడి నెలకొంది. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా (AO) పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ ఉత్తర్వులు ఇచ్చారు. పి.రాజశేఖర్ (తనకల్లు), బి.మహేశ్ (గోరంట్ల), వైకే నరేంద్ర రెడ్డి (గాండ్లపెంట), సి.పద్మ ప్రియ (రొద్దం) మండలాలకు నియమితులయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఛైర్‌పర్సన్ వారికి సూచించారు.
News February 18, 2026
ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

1745: బ్యాటరీ ఆవిష్కర్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం (ఫొటోలో)
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం


