News December 2, 2025

VKB: డీసీసీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్న ధారాసింగ్

image

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ధారా సింగ్‌కు ఆమె నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

Similar News

News February 13, 2026

పోస్టల్ బ్యాలెట్.. లీడింగ్‌లో కాంగ్రెస్

image

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. ఏదులాపురం (ఖమ్మం), మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. నిర్మల్, ఖానాపూర్‌, కాగజ్‌నగర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

News February 13, 2026

ఉప్పాడ హార్బర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. హార్బర్‌లోని రాళ్లగుట్టపై మృతదేహాన్ని గమనించిన మత్స్యకారులు స్థానికులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: వరంగల్ పోలీసులు

image

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.