News November 19, 2025
VKB: డీసీసీ పీఠం రఘువీరారెడ్డికి దక్కేనా.!

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన అతనిని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. BRS పాలనలో జిల్లాను ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడని రఘువీరా రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Similar News
News January 17, 2026
HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.
News January 17, 2026
విశాఖ-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ కష్టాలు

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 45 కిలోమీటర్లు. ప్రస్తుతం నగరం మధ్యగా వెళ్లే నేషనల్ హైవేనే ప్రధాన మార్గంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఆనందపురం జంక్షన్‌కి చేరుకోవడానికే గంటకు పైగా సమయం పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కోస్టల్ బీచ్ కారిడార్ రహదారిని ప్రతిపాదించారు. విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు 6 వరుసల రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్‌లో ఉంది.
News January 17, 2026
విశాఖ: మాస్టర్ ప్లాన్‌కు ముందే ఈ రహదారుల నిర్మాణం

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అయితే పోర్టు నుంచి భోగాపురం వరకు 6 వరుసల రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ ఆచరణలోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. ఈలోగా VMRDA అడవివరం-గండిగుండం, చిప్పాడ-పోలిపల్లి, నేరేళ్లవలస-తాళ్లవలస, బోయపాలెం-కాపులుప్పాడ, గంభీరం రహదారుల నిర్మాణాలను చేపట్టింది. ఇవి పూర్తయితే ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ మెరుగవుతుంది.


