News November 19, 2025

VKB: ‘డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’

image

యువత డ్రగ్స్ మహమ్మారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణ కుమారి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థి దశలో డ్రగ్స్‌కు అలవాటు పడితే పూర్తిగా జీవితం చిన్న భిన్నం అవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

Similar News

News January 22, 2026

సన్ గ్లాసెస్‌తో మాక్రాన్.. కారణమదేనా?

image

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. కంటి సమస్య(రక్తం గడ్డకట్టడం) వల్లే ఆయన గ్లాసెస్ ధరించారని ఫ్రెంచ్ మీడియా చెబుతుండగా తగ్గేదేలే అంటూ ట్రంప్‌నకు ఆయన మెసేజ్ ఇచ్చారేమోనని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా <<18905776>>ట్రంప్<<>> దీనిపై WEFలో మాట్లాడుతూ ‘మాక్రాన్ బ్యూటిఫుల్ గ్లాసెస్ ధరించి కనిపించారు. అసలేం జరిగింది?’ అని వెటకారంగా అన్నారు.

News January 22, 2026

మధిర: ‘కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే కమ్యూనిజం ప్రధాన లక్ష్యం’

image

మధిర పట్టణంలో నిర్వహించిన సీపీఎం నేత కట్టా గాంధీ సంస్మరణ సభలో బుధవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు, కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే కమ్యూనిజం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు.

News January 22, 2026

భారత ప్లేయర్‌కు గాయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.