News March 12, 2025

VKB: దివ్యాంగులు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

దివ్యాంగుల గుర్తింపు కార్డు కోసం యుఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో సదరం క్యాంపులు, ప్రత్యేక దివ్యాంగ గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 21 రకాల వైకల్యాలపై యుఐడీ కార్డులు పొందవచ్చునని సొంత మొబైల్ ద్వారా యుఐడీ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 20, 2026

చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

image

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

image

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 20, 2026

నంద్యాల జిల్లాకు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.