News August 23, 2025

vkb: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

image

జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పోక్సో కేసులపై, ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

Similar News

News January 19, 2026

JGTL: మున్సిపల్ పోరు.. జీవన్ వర్సెస్ సంజయ్!

image

JGTLలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ పీక్ స్టేజికి చేరింది. దీంతో తమకు బీఫామ్ ఇచ్చే నేత ఎవరో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ డివిజన్ టికెట్ ఎవరు ఫైనల్ చేస్తారో తెలియక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. JGTL మున్సిపల్‌లో 50 డివిజన్స్ ఉండగా.. 94,800 మంది ఓటర్లు ఉన్నారు.

News January 19, 2026

హైదరాబాద్‌లో 54 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

నగరంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 54 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద సంఖ్యలో SHOలు ఇతర విభాగాలకు బదిలీ అయ్యారు. మరో 26 మంది బదిలీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వారందరూ సీపీ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

News January 19, 2026

ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

image

<>IIT <<>>ఢిల్లీ 17 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు JAN 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, PhD (సైన్స్/ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- 2కు నెలకు రూ.67K+HRA, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3కి రూ.78K+HRA, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28K చెల్లిస్తారు. సైట్: https://ird.iitd.ac.in