News December 1, 2025
VKB: ప్రజావాణికి 16 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కారం చూపుతున్నట్లు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను శాఖల వారీగా అధికారులు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2026
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 83,399 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 25,719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, HCL టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, బెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News February 18, 2026
గతంలోనూ పలుమార్లు YouTube డౌన్

యూట్యూబ్ <<19172024>>ఇవాళ<<>> డౌన్ అవడంతో యూజర్లు లక్షల సంఖ్యలో కంపెనీకి రిపోర్ట్ చేశారు. గతంలోనూ పలుమార్లు దీని సేవలకు అంతరాయం ఏర్పడింది. 2008 ఫిబ్రవరిలో పాకిస్థాన్ టెలికం తప్పుగా YouTube IPలను బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్‌గా 2 గంటలు డౌన్ అయింది. 2019 అక్టోబర్, 2020లో నవంబర్, డిసెంబర్‌లో సర్వర్ సమస్యలు తలెత్తాయి. 2025 అక్టోబరులోనూ US, UK, కెనడా, ఆస్ట్రేలియాలో సేవలు నిలిచిపోయాయి.
News February 18, 2026
మోపాల్: చెరువులో పడి పశువుల కాపరి మృతి: SI సుస్మిత

చిన్నాపూర్ చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మాణిక్యం (38) అనే పశువుల కాపరి మృతి చెందినట్లు మోపాల్ SI సుస్మిత తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా మండలానికి చెందిన మాణిక్యం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందాడన్నారు.


