News September 10, 2025

VKB: ఫైనల్ ఓటర్ జాబితా విడుదల

image

వికారాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ జాబితా ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేశారు. బుధవారం జిల్లా పరిషత్ నోటీస్ బోర్డ్‌పై పోలింగ్ కేంద్రాల జాబితాను అతికించారు. అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను మండల పరిషత్, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు. దీని ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 10, 2025

SKY..WHY?

image

IND టీ20 కెప్టెన్ సూర్య గత కొంతకాలంగా బ్యాటుతో రాణించలేకపోతున్నారు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైన ఈ హిట్టర్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత 19 ఇన్నింగ్స్‌లలో 13.47Avg, 119.35 స్ట్రైక్ రేటుతో 222 రన్స్ చేశారు. ఇందులో 11 ఇన్నింగ్స్‌లలో ఆయన స్కోర్ 10లోపే ఉంది. నిన్న SAతో తొలి T20లో 12 రన్స్ చేశారు. కెప్టెన్సీ వల్లే SKY బ్యాటింగ్‌లో ఫెయిలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News December 10, 2025

కృష్ణా: లంచాల భయం.. BPS మాకొద్దు బాబోయ్!

image

విజయవాడ, తాడిగడప, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నంలో అనధికార కట్టడాలు కోకొల్లలు. ఒక్క విజయవాడలో 10 వేలకు పైగా నిర్మాణాలు ఉంటే మిగతా చోట్ల 2వేల వరకు ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రెగ్యులరైజేషన్‌కు ఎవరూ ముందుకు రావడం లేదు.

News December 10, 2025

ఇంటి చిట్కాలు

image

* ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.