News September 13, 2025

VKB: భారీ వర్షాలు.. మరో 3 రోజులు జాగ్రత్త

image

వికారాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. పెద్దేముల్ మండలంలో అత్యధికంగా 65.7మి.మీ, అత్యల్పంగా నవాబుపేట మండలంలో 5.7మి.మి వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Similar News

News December 11, 2025

గురువారం బృహస్పతిని పూజిస్తే..

image

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.

News December 11, 2025

TML: కల్తీ అని తెలిసినా ఎలా అనుమతించారు?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసు సిట్ కస్టడీలో రెండో రోజు ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అజయ్ కుమార్ సుగంధ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. మైసూరు రిపోర్ట్ వచ్చాక ఎవరికి చెప్పారు? కల్తీ అని తెలిసినా ఎందుకు తప్పు చేశారు? వారు ఇచ్చే కమీషన్లకు ఎందుకు తలొగ్గారు? అని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. ఈయన కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.

News December 11, 2025

నంద్యాల మీదుగా వెళ్లే రైలుకు బోగీల పెంపు

image

నంద్యాల మీదుగా ప్రయాణించే గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మార్పు చేశారు. గతంలో 19 బోగీలతో ఉన్న ఈ రైలు ఇక నుంచి 24 బోగీలతో ప్రయాణించనుంది. ఇందులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సౌకర్యం ఈ నెల 18 నుంచి తిరుపతి వైపు రైలుకు, 19 నుంచి గుంటూరు వైపు రైలుకు అందుబాటులోకి రానుంది.