News March 8, 2025
VKB: భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం: కలెక్టర్

ప్రభుత్వం అందించిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు చెందిన 24 మంది రైతులకు రూ.6.44 కోట్ల పరిహారాన్ని అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తహశీల్దార్ కిషన్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
Similar News
News January 16, 2026
నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 16, 2026
పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

నెలసరి సమయంలో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.
News January 16, 2026
చలికాలంలో కోడిపిల్లల పెంపకంలో జాగ్రత్తలు

షెడ్‌లోకి కోడి పిల్లలను వదిలిన తర్వాత ప్రతిరోజూ 2 లేదా 3 సార్లు వాటి ప్రవర్తన, ఆరోగ్యస్థితిని పరిశీలించాలి. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్లను ఉంచే షెడ్‌కు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండేలా చూసుకోవాలి. కోడి పిల్లలను ఉంచే షెడ్‌లో లిట్టరు పొడిగా ఉండేట్లు జాగ్రత్తపడాలి. కోడి పిల్లలను పెంచే షెడ్ వైపునకు నాటు కోళ్లను రానీయకూడదు. చలి గాలులు సోకకుండా షెడ్డుకు ఇరువైపులా పరదాలను వేలాడదీయాలి.


