News May 7, 2025

VKB: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు.. 30 వరకు ఛాన్స్

image

తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉన్నట్లు పరిగి మైనారిటి రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ మహబూబ్ పాష తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ఆసక్తిగల మైనార్టీ, నాన్ మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు, మరిన్ని వివరాలకు https://cet.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని చెప్పారు.

Similar News

News February 18, 2026

హోలీ కానుకగా డీఏ పెంపు?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ(మార్చి 4) కానుకగా DA పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది JAN నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా <<18718812>>8వ వేతన సంఘం<<>> ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

News February 18, 2026

క్రీడా ప్ర‌తిభ‌కు వ‌న్నె తెచ్చేలా ప్ర‌భుత్వం కృషి: కలెక్టర్

image

క్రీడా ప్ర‌తిభ‌కు వ‌న్నె తెచ్చేలా ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని..ప్ర‌భుత్వ సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ క్రీడా ప్ర‌పంచంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-13,15,17,19 విభాగాల్లో బాలురు,బాలికలకు జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్, సెల‌క్ష‌న్స్ నిర్వ‌హించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు.

News February 17, 2026

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఉప్పల్‌వాయి యువకుడు మృతి

image

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన జంగిటి రాజు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వెన్నెల డిబేట్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.