News August 12, 2025
VKB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కలెక్టరేట్ ఉద్యోగి

లంచం తీసుకుంటూ ఏసీబీకి కలెక్టరేట్ ఉద్యోగి సుజాత పట్టుబడింది. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సుజాతను ఏసీబీ అధికారులు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమి క్లియరెన్స్ కోసం బాధితుడి నుంచి రూ.20 వేలు డిమాండ్ చేయగా గతంలో రూ.5 వేలు ఇచ్చాడు. నేడు మిగత నగదు రూ.15 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు.
Similar News
News March 13, 2026
నిర్మల్: ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు

డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ హాకీంపేట ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో పద్మ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 16వ తేదీన నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే పోటీలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు.
News March 13, 2026
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బెనిఫిట్ షోలు ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ప్రదర్శితమవుతాయి.
News March 13, 2026
MNCL: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. 48 కేంద్రాల్లో ఉ.9.30 నుంచి 12.30గంటల వరకు జరిగే పరీక్షలకు 4, 897 మంది బాలురు, 4, 806 మంది బాలికలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.


