News December 3, 2025

VKB: లైన్ మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ

image

కరెంట్ షాక్‌తో యువకుని మృతికి కారణమైన విద్యుత్ శాఖ లైన్‌మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేశారు. 2020లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరంపల్లిలో లైన్‌మెన్ అబ్దుల్ జలీల్, ఎల్‌సీ (Line Clear) తీసుకోకుండా నిర్లక్ష్యంగా కుషా రెడ్డిని కరెంట్ పోల్‌పైకి ఎక్కించి మృతికి కారణమవడంతో ఈ శిక్ష పడినట్లు ఎస్పీ తెలిపారు.

Similar News

News February 16, 2026

కోల్ బెల్ట్‌కు మేయర్.. మంచిర్యాలకు డిప్యూటీ.!

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. మేయర్ పదవి కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ మంచిర్యాల ప్రాంతానికి చెందిన సల్ల రమ్య పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సోమవారం జరగనున్న కార్పొరేట్ ప్రమాణ స్వీకార సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్ కవర్‌తో బయటపడనున్నాయి.

News February 16, 2026

తిరుపతి: PGRS తాత్కాలిక రద్దు

image

ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శాంతిభద్రతల బందోబస్తులో పోలీసులు నిమగ్నమై ఉండటంతో రద్దు చేశామన్నారు. అత్యవసర ఫిర్యాదుల కోసం ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.