News September 11, 2025

VKB: లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరేలా చూడాలి: ఎస్పీ

image

సెప్టెంబర్ 13న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి పోలీస్ స్టేషన్ల అధికారులను సూచించారు. రాజీయే రాజమార్గమని కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు పరిష్కరించాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

Similar News

News December 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 12, 2025

కామారెడ్డి: NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ

image

భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో KMR ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.

News December 12, 2025

ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

image

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వక‌పోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.