News November 7, 2025
VKB: వందేమాతరం దేశ సమైక్యతకు తోడ్పడుతుంది: కలెక్టర్

వందేమాతరం జాతీయగీతం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం గేయం ఆలపించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 20, 2026
చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News January 20, 2026
నంద్యాల జిల్లాకు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
News January 20, 2026
ఫోన్‌పే IPOకు SEBI ఓకే

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్ ద్వారానే జరుగుతున్నాయి.


