News November 8, 2025

VKB: సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలి: ఎస్పీ

image

సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణలో పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ క్రైమ్, సీడీఆర్ అనాలసిస్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. నేరగాళ్లు రూట్లు మార్చి ప్రజలను దోచుకుంటున్నారని, వాటిని నియంత్రించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Similar News

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News January 20, 2026

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరల వివరాలు

image

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 30 వేల ఏసీ బస్తాలు, 35 వేల కొత్త బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. ప్రధాన రకాల ధరలు (కేజీకి): ఎల్లో రకం: రూ.350 – 450, (అత్యధికం) 2043: రూ.200 – 290 తేజా: రూ.140 – 185, 355 రకం: రూ.160 – 210, బుల్లెట్: రూ.160 – 200, నాటు రకాలు: రూ.150 – 210, సీడు తాలు: రూ.90 – 140 వరకు ధర పలికాయి.

News January 20, 2026

ములుగు: సీట్ బెల్ట్ పెట్టుకోండి.. హెల్మెట్ ధరించండి..!

image

అతివేగం ప్రమాదకరమని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ రెడ్డి అన్నారు. ములుగులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రోడ్డు భద్రత పోస్టర్‌ను ఆవిష్కరించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాను రోడ్డు ప్రమాదరహితంగా మార్చుకుందామన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని తెలిపారు.