News December 2, 2025
VKB: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం తెలిపారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు ప్రతి వారం ఒక్క ప్రత్యేక థీమ్‌తో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.
News February 13, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 13, 2026
పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్

రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ విజయానంద్ శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు.


