News December 3, 2025
VKB: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎస్పీ

సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసులకు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్‌ను ఆవిష్కరించి 42 రోజుల శిక్షణను ప్రారంభించారు. సైబర్ నేరాలు నియంత్రణలో ఇస్తున్న శిక్షణను పోలీసులు అవగాహన కల్పించుకోవాలన్నారు.
Similar News
News February 13, 2026
సంచలనం.. ఓటుకు రూ.70,000?

TG: రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు ఎన్నిక సంచలనంగా మారింది. కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఓటుకు ₹70K, 25KGల బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పట్టుచీర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ₹7Cr ఖర్చు చేశారని టాక్. అదే వార్డులో మరో అభ్యర్థి కూడా ఓటుకు ₹40K పంచినట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ ఊపులో ఉండటంతోనే పదవికి పోటీ ఏర్పడిందంటున్నారు.
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.
News February 13, 2026
సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 18న ఐఈఎల్టీఎస్ (IELTS) పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 17వ తేదీలోపు నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


