News April 12, 2025

VKB: హోటళ్లు, బేకరీలపై దాడులు.. జరిమానాలు

image

నిబంధనలను అతిక్రమించి కల్తీలకు పాల్పడుతున్న హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌస్‌లపై దాడులు నిర్వహించి భారీ జరిమానాలు విధిస్తున్నట్లు వికారాబాద్ ఇన్‌ఛార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ ఏసుదాస్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌లోని హోటళ్లు, బేకరీలపై దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని షాపులపై రూ. 7వేల జరిమానా విధించినట్లు తెలిపారు. యజమానులు తప్పక నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

పాలమూరు తొలి మేయర్‌గా బీసీ మహిళ

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఖరారు అయింది. రిజర్వేషన్లలో మేయర్ స్థానాన్ని బీసీ మహిళగా ఖరారు చేస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయిన తర్వాత తొలి మేయర్‌గా బీసీ మహిళ అందాల ఎక్కబోతుంది. కాగా పాలమూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో బీసీ సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

image

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.

News January 17, 2026

ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీటితో<<>> 24 మంది మరణించడంతో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గిల్ అప్రమత్తమయ్యారు. రూ.3 లక్షల విలువైన స్పెషల్ వాటర్ ప్యూరిఫికేషన్ మెషీన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ఈ మెషీన్ RO, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీటినీ శుద్ధి చేయగలదని నేషనల్ మీడియా పేర్కొంది. దాన్ని గిల్ తన గదిలో ఉంచుకోనున్నట్లు చెప్పింది. కాగా రేపు ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే జరగనుంది.