News November 12, 2025

VKB: ప్రజల భద్రత కోసమే తనిఖీలు: ఎస్పీ

image

ప్రజల భద్రత కోసమే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలలో డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉంటే 100కు డయల్ చేయాలన్నారు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

image

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.

News November 12, 2025

నల్గొండ: జూబ్లీహిల్స్‌‌ ఫలితాలపై కాయ్ రాజా కాయ్..!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్ బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. అక్కడి గెలుపోటములపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు మొబైల్ యాప్స్‌లో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల ద్వారా పందేలు వేస్తున్నారు. ఎన్నిక ఫలితం వెలువడే నాటికి రూ.లక్షల్లో చేతులు మారే అవకాశముందని టాక్. బిహార్ ఎన్నికల ఫలితాలపైనా పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల ఫలితాలు ఎల్లుండి రానున్నాయి.

News November 12, 2025

మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

image

‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.