News November 2, 2025
VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్‌పేట్‌తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.
Similar News
News November 2, 2025
HYD: OU మౌలిక వసతులను సమీక్షించిన VC

ఉస్మానియా యూనివర్సిటీ(OU) పరిపాలన విభాగం నేడు ప్రాంగణంలోని వివిధ సౌకర్యాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులను సమగ్రంగా సమీక్షించింది. ఈ తనిఖీకి ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి, ప్రొఫెసర్ కుమార్ మొలుగారం నాయకత్వం వహించారు. హాస్టల్ సౌకర్యాలు, క్రీడా మౌలిక వసతులు, కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను సమీక్షించారు. రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి, చీఫ్ వార్డెన్ డాక్టర్ జి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
News November 2, 2025
శివాలయాలు, తీరప్రాంతాల్లో భద్రత పటిష్ఠం: ఎస్పీ

కార్తీక మాసంలో సముద్రతీరాలు, నదీ తీరాలు, శివాలయాలకు భక్తులు అధికంగా చేరతారని అధికారులు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన ప్రదేశాల్లో బందోబస్తు, గజ ఈతగాళ్ల నియామకం, మహిళా భద్రతకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆలయాలు, పిక్నిక్ స్పాట్లలో నిఘా, పెట్రోలింగ్ పెంచారు. సోమవారాలు, పర్వదినాల్లో అదనపు సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నట్లు ఎస్పీతుహిన్ సిన్హా తెలిపారు.
News November 2, 2025
దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.


