News August 13, 2025
VKB: 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాలతో రాబోవు 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చోట పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
రెండోసారి తల్లయిన నటి పూర్ణ

టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త ఆసిఫ్ ఆలీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితంగా డెలివరీ అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ 2022లో వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో బాబుకు జన్మనిచ్చారు. ఈమె తెలుగులో సీమ టపాకాయ్, అవును, సుందరి, అఖండ తదితర చిత్రాల్లో నటించారు.
News March 14, 2026
సిక్కోలు దొర..సేవలు మరువలేం

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.
News March 14, 2026
కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి గుల్బర్గా వైపు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో అభిషేక్, సుమంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


