News April 1, 2024
వాలంటీర్లను ట్రాన్స్‌ఫర్ చేయాలి: లక్ష్మీనారాయణ

AP: వాలంటీర్లను సస్పెండ్ చేయకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ECని కోరారు. ‘సస్పెండ్ అయిన వాలంటీర్లు ఇంకా ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి వారిని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఉత్తరాంధ్ర వారిని రాయలసీమకు, రాయలసీమ వారిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇలా బదిలీ చేస్తే వారి ప్రభావం ఓటర్లపై ఉండదు. ఎన్నికలు సజావుగా జరుగుతాయి’ అని అన్నారు.
Similar News
News February 13, 2026
బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 13, 2026
దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.
News February 13, 2026
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.


