News October 6, 2025
VSSCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSC) 17 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే (OCT 6) ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సా. 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.750. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.vssc.gov.in/
Similar News
News January 24, 2026
బాలికలను ఎగరనిద్దాం..

అమ్మాయిలు ప్రస్తుతం యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించే కాకుండా బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం.
News January 24, 2026
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: CBN

AP: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని CM చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.
News January 24, 2026
KTRను నేరస్థుడిగా పరిగణించలేదు: జూపల్లి

TG: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతోందని, కేటీఆర్‌కు CRPC 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను నేరస్థుడిగా పరిగణించలేదని, సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచారని తెలిపారు. ప్రభుత్వానిది రాజకీయ కక్ష అనడం సరికాదని, కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాలని పేర్కొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.


