News August 11, 2025

VZM: అనర్హులు ఉంటే తొలగించాలని ఆదేశం

image

ఆగ‌స్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల ద‌త్త‌త ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బిఆర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. వివిధ అంశాల‌పై ఆన్‌లైన్ సమావేశం ద్వారా క‌లెక్ట‌ర్ సోమవారం స‌మీక్షించారు. జిల్లాలో మొద‌ట 67,066 బంగారు కుటుంబాల‌ను గుర్తించ‌గా, వ‌డ‌పోత‌ల అనంత‌రం ఆ సంఖ్య 60,612కు త‌గ్గింద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఇంకా ఎవ‌రైనా అన‌ర్హులు ఉంటే తొల‌గించాల‌ని సూచించారు.

Similar News

News March 13, 2026

VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

image

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్‌-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్‌కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్‌ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 13, 2026

పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం: VZM ఎస్పీ

image

ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమ పేరుతో మోసం చేసే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

News March 13, 2026

కలెక్టరేట్‌లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి: కలెక్టర్

image

కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘ సభ్యులు, ప్రజలు హాజరుకావాలని ఆయన సూచించారు.